శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో లారీల్లో అమర్చిన బ్యాటరీలు చోరీ చేస్తోన్న హరీష్ కుమార్ అనే యువకుణ్ని లారీ ఓనర్స్ సంఘం ప్రతినిధులు పట్టుకున్నారు. రెండేళ్లుగా పట్టణంలోని లారీల్లో వరుస బ్యాటరీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 200 బ్యాటరీలు చోరీకి గురయ్యాయని లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. చాలా తెలివిగా చోరీ చేస్తూ తప్పించుకుంటోన్న హరీష్‌ను ప్రణాళిక ప్రకారం పట్టుకుని... పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: