శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఉద్దానం ప్రాంతంలో యథేచ్ఛగా సంచరిస్తూ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా బాతుపురంలో ఉదయపు నడకకు వెళ్లిన బత్తిన కామేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అతన్ని స్థానికులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.
ఇదీ చదవండి: