శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయం సమీపంలో కండ వీధికి చెందిన కన్నయ్య బెహరా అనే యువకుడు చిన్న బడ్డీ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. కొంత మంది తనను దుకాణం పెట్టవద్దని వాదించగా.. మనస్థాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటుండగా... స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి