ఉల్లి ధరల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర తారస్థాయికి చేరిన కారణంగా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో రాయితీపై కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రాయితీపై విక్రయాలు ప్రారంభించారు.
కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తుండడంతో రాత్రి, పగలు, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారులు ఉల్లి అమ్మకాల్లో వివక్ష చూపుతున్నారని వినియోగదారులు బోరున విలపిస్తున్నారు. ఉల్లి పంపిణీలో అధికారుల పర్యవేక్షణ శూన్యమనే చెబుతున్నారు వినియోగదారులు. నామమాత్రంగా కౌంటర్లు నిర్వహిస్తుండటంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో వాలంటీర్ల ద్వారా ఉల్లి పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అధికారులు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల ద్వారా సరైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి