శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పాలకొండ రోడ్.. జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు కొందరు కీచకులు. ఓ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో బాధితురాలు ఇద్దరూ స్నేహితులతో కలసి రూమ్లో అద్దెకు ఉంటుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో టిఫిన్ చేయటానికని బయటకు బయలుదేరింది. అదే సమయంలో ఆమె రాకను గమనించిన ఓ వ్యక్తి...చేయి పట్టుకున్నాడు. నిందితుడితో పాటు అతడి ముగ్గురు స్నేహితులు...అమ్మాయిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. బాధను భరించలేని బాధితురాలు కాపాడండి అంటూ కేకలు వేయగా... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితరాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఇదీ చదవండీ: