ETV Bharat / state

'అప్పుడు ముద్దులు..ఇప్పుడు లాఠీదెబ్బలా?'

రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ప్రజల పన్నుల డబ్బును వైకాపా కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు.

'అప్పుడు ముద్దులు..ఇప్పుడు లాఠిదెబ్బలా?'
author img

By

Published : Sep 4, 2019, 2:02 PM IST

Updated : Sep 4, 2019, 2:49 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి జన్మదిన వేడుకలకు హాజరైన లోకేశ్ ఎన్టీఆర్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి వద్ద 144 సెక్షన్ ఉండదని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ ఆయన ఇంటి ముందు ధర్నాలు జరగలేదని తెలిపారు. ఎన్నికల ముందు జగన్‌ ముద్దులు పెట్టి ఇప్పుడు లాఠీదెబ్బలు కొట్టిస్తున్నారని విమర్శించారు.
'జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయి. ఎన్నికల ముందు 900 హామీలు జగన్ ఇచ్చారు. ఇప్పుడు వాటితో సంబంధం లేదని నవరత్నాలు అంటున్నారు. పింఛను డబ్బులు పాపం అధికారులు జేబులో నుంచి ఇస్తున్నారు. ఆంధ్రుల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి. చంద్రబాబు ఐదేళ్లు అహర్నిశలు కష్టపడ్డారు. నిర్మాణాల కోసం తెచ్చిన ఇసుకనూ వాళ్లు దొంగిలిస్తున్నారు. నర్సీపట్నంలో రక్తదానం చేస్తామంటే అనుమతి ఇవ్వడానికి ఇబ్బందిపెట్టారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మేం ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?.' అని విమర్శించారు.

Intro:రైతులు ఆందోళన

Body:మదనపల్లె ఉప పాలనాధికారి ఇ కార్యాలయంతో రైతులు నిరసన

Conclusion:బలవంతపు భూసేకరణ ఆపేయాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లి ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి మండలం కొత్త వారి పల్లి చిన్న రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఒకవైపు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వం రైతుల వద్ద నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతుందని ఆరోపించారు ఇలా చేసిన భూములకు కూడా న్యాయపరంగా నష్ట పరిహారము చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పాలనాధికారి తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు బై టు పి ఎల్ నరసింహులు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
Last Updated : Sep 4, 2019, 2:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.