మీడియాతో మాట్లాడుతున్న కళా వెంకట్రావు రాష్ట్రంలో ఇప్పుడున్న అప్రజాస్వామిక పరిపాలన ఎన్నడూ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అన్నారు. శుక్రవారం.. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా సర్కార్ మేక వన్నె పులిలా ప్రవరిస్తుందన్నారు. అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనను.. జగన్ ప్రభుత్వంలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని.. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించకుండా ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. పత్రికల నోరు నొక్కే ప్రయత్నం చేయకూడదన్న కళా వెంకట్రావు.. అసెంబ్లీ సమావేశాలను కొన్ని టీవీ ఛానళ్లలో నిలుపుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైకాపా పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇప్పటికైనా వైకాపా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి :
'ఆ మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలి'