శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేటలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుళాయి పైపులైను విషయంలో ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ వివాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజాం రూరల్ సీఐ శ్రీనివాసరావు... సంతకవిటి ఎస్సై రామారావు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా వర్గీయులు సంతకవిటి పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకుని కొట్లాటకు కారకులైన తెదేపా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. 11 మందికి గాయాలు