శ్రీకాకుళం జిల్లా సొగిడియ గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో మధ్యాహ్నం ఎరువు వేస్తుండగా... తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు