ఎప్పుడో.. చిన్నప్పుడు ఇంటికి దూరమైన భవాని రక్త సంబంధీకుల చెంతకు చేరింది. తన స్వగ్రామానికి చేరుకున్న ఆమెకు ఎదో తెలియని అనుభూతి. మనసులో ఏదో ఆనందం. ఇన్నేళ్ల తన అనుభవం.. తన జీవిత విధానం కుటుంబ సభ్యులకు చెప్పుకుంది. ఇలా మళ్లీ కన్నప్రేమను కలవడం అస్సలు నమ్మలేకపోతోంది. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్లో తప్పిపోయిన భవాని.. జయమ్మ అనే మహిళ దగ్గర పెరిగింది. విజయవాడకు చెందిన వంశీ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ద్వారా ఫేస్బుక్లో భవాని తన అన్నను గుర్తించింది. పెంచిన తల్లితో పాటు కన్నతల్లి కావాలని చెప్పిన భవాని.. ప్రస్తుతం తన తల్లిదండ్రుల చెంతకు వచ్చింది.
సంబంధిత కథనాలు :