ఉపాధి హామీ పథకం అమలుపై జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని దిల్లీలో నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవార్డులు అందజేశారు. ఉపాధి హామీ పథకం అమలు, పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థ స్వపరిపాలనలో... అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. 4 పురస్కారాలు దక్కించుకుంది. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన శ్రీకాకుళం జిల్లా అవార్డును అందుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది... కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు పొందారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి మొత్తం 8 ఎనిమిది అవార్డులు వచ్చాయని ద్వివేది తెలిపారు.
ఇదీ చదవండి: