ప్రకాశం జిల్లా నాగులవరం గ్రామంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సాలెపురుగు, సీతాకోకచిలక మధ్య పోటీ జరిగింది. గూడు కట్టడంలో ఎంత ప్రతిభ చూపుతుందో... వేటాడడంలోను అంతే కసి చూపిస్తుంది సాలె పురుగు. ఎంత పెద్ద కీటకమైనా గూడుకు తాకితే బందీ కావలసిందే. చల్లని గాలికి విహరిస్తున్న ఓ సీతాకోకచిలుక సాలెపురుగు గూటిలో చిక్కుకుంది. తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంతలో గిలగిలా కొట్టుకుంటున్న సీతాకోకచిలుకను చూసింది సాలె పురుగు. అంతే తనకు ఆహారం దొరికిందని లొట్టలేసుకుంటూ అమాంతం సీతాకోకచిలుకను బంధించింది. ఈ ఘటన చూపరులను కట్టిపడేస్తుంది.
ఇదీ చూడండి: వింతైన ఎలుకలు... చూసేందుకు పర్యటకుల ఉరకలు