సృజనాత్మకతకు నిదర్శనం
13 జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల విద్యార్ధులు తమ మేథస్సు, సృజనాత్మకతకు పదునుపెట్టి... సుమారు 234 ప్రాజెక్టులు ప్రదర్శించారు. సులభమైన, తక్కువ ఖర్చుతో, సమయాన్ని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రైతులు సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అనే విషయంపై పలు నమూనాలు తయారు చేశారు.
ఆకట్టుకున్న ప్రాజెక్టులు
ప్రకాశం జిల్లా వీరేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు చేసిన విత్తనాల గోడు అనే ప్రాజెక్టు ఆలోచింపజేసింది. సంతనూతలపాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన అగ్రికల్చరల్ మల్టీ ట్రేడింగ్ మిషన్ ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా గుత్తి విద్యార్థులు రూపొందించిన రోటేట్ గార్డెన్ ద్వారా తక్కువ స్థలాలు ఉన్న అపార్ట్మెంట్లలో కూరగాయలు పండే విధానాన్ని చూపించారు. పలు రకాలు ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు
ఈ ప్రదర్శనలు వీక్షించేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తులో విద్యార్థులు హాజరవుతున్నారు.. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలు తమలో శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరుస్తున్నాయంటున్నారు విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో ఎంపికయిన బృందాలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి