ప్రకాశం జిల్లా ఒంగోలులో దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీలు జరిగాయి. తాడేపల్లిగూడెం బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలకు చెందిన బాలుర జట్టు బాలుర విభాగంలో కప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో కేరళ జట్టు గెలిచింది. ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన 13 బృందాల్లో విజేతలుగా నిలిచిన ఈ జట్లు.. జనవరి 26న జరగనున్న స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో కవాతు నిర్వహించనున్నాయి. వీరికి మానవ వనరుల శాఖ బ్యాండ్ కో ఆర్డినేటర్ గిరిజాశంకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలనేదే లక్ష్యంగా ఉంటుందని... అది తాము సాధించినందుకు గర్వంగా ఉందని విజేతలు చెప్పారు.
ఇవీ చదవండి: