ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పిన కారు... రైలింగ్‌ను దాటి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పూణే నుంచి మాచవరంలోని బంధువుల ఇంటికి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: మద్యం తలకెక్కింది... బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కాడు..