తొలగించిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గత ఐదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నామని ఇప్పటికిప్పుడు తొలగిస్తే తమ పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన 20 మందిని విధుల్లోకి తీసుకునేంత వరకు కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని... తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. చెత్త సేకరించే వాహనాలను బయటకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వీరికి తెదేపా, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: