ETV Bharat / state

దిల్లీతో రంజీ మ్యాచ్.. గెలుపు దిశగా ఆంధ్ర - ఒంగోలులో ఆంధ్ర దిల్లీ మధ్య రంజీ మ్యాచ్

దిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్​లో ఆంధ్ర జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడోరోజు ఆట ముగిసేసరికి దిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. విజయానికి 4 వికెట్ల దూరంలో ఆంధ్ర జట్టు ఉంది.

ranji trophy between andhra and delhi at ongole prakasam district
దిల్లీతో రంజీ మ్యాచ్.. గెలుపు దిశగా ఆంధ్ర
author img

By

Published : Dec 20, 2019, 11:04 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఆంధ్ర, దిల్లీ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ఆసక్తిగా జరుగుతోంది. మూడోరోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు 70 పరుగులతో క్రీజులో ఉన్న రికీ భుయ్ శతకంతో అదరగొట్టాడు. అద్భుతమైన షాట్స్​తో 313 బంతుల్లో 15 బౌండరీలు, 4 సిక్స్​ల సాయంతో 144 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. దీంతో ఆంధ్ర జట్టు 153 పరుగుల ఆధిక్యం సాధించింది. దిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ 86 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన దిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి దిల్లీని కష్టాల్లోకి నెట్టాడు.

ఇవీ చదవండి..

దిల్లీతో రంజీ.. ఆధిక్యంలో ఆంధ్ర

Intro:AP_ONG_17_19_RANJI_THIRD_DAY_AV_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
........................
స్క్రిప్ట్ మోజోలో పంపడం జరిగిందిBody:OngoleConclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.