ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో దిల్లీతో జరుగిన రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజు రెండో ఇన్సింగ్లో 89 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దిల్లీ.. నాలుగోరోజు 169 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్ర ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్, స్టీఫెన్ చెరో ఐదు వికెట్లు తీసుకుని దిల్లీ పతనంలో కీలకపాత్ర పోషించారు. దిల్లీ బ్యాట్స్మెన్ లలిత్ యాదవ్ అర్థ సెంచరీతో పోరాడినా.. జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
ఇవీ చదవండి..