ఇదీ చదవండి:
పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు - ప్రకాశంలో పంచలోహ విగ్రహాలు చోరీ న్యూస్
చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని పురాతన పంచలోహ విగ్రహాలను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.45 లక్షలు విలువ చేసే రెండు పంచలోహ విగ్రహాలు, మూడు ఉత్సవ విగ్రహాలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
ప్రకాశం జిల్లా కొరశపాడుకు చెందిన మల్లిఖార్జునరావు, ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజేశ్, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన హిదామ్ తుల్లా, కృష్ణా జిల్లా రెడ్డిగూడానికి మరో వ్యక్తి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్రకాశం జిల్లా కొరశపాడు మండలం తుమ్మవరం గ్రామంలోని కాశీవిశ్వేశ్వర స్వామి శివాలయంలో అమ్మవారి పంచలోహ విగ్రహం, రాచపూడి గ్రామం చిదంబదేశ్వరస్వామి దేవాలయంలో వీరభధ్రుడు పంచలోహ విగ్రహం దొంగిలించారు. ఈ రెండు విగ్రహాలూ 12వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల కాలం నాటివి. విగ్రహాలను అమ్మేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పంచలోహ విగ్రహాలతో పాటు మూడు ఉత్సవ మూర్తులను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు.
ఇదీ చదవండి:
sample description
TAGGED:
panchaloha vigrahalu news