కుమార్తె వ్యవహార శైలి బాగోలేదని కన్నతల్లే తన కుమార్తెను హత్య చేసింది. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామానికి చెందిన మధుబాల పెళ్లైనా భర్త బేల్దారి కూలీ కావడం పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కుమార్తె వ్యవహారశైలిపై తల్లి ఏడుకొండలు, మధుబాలకు మధ్య తరచూ గొడవలయ్యేవి. విసుగు చెందిన తల్లి.. రాత్రి కుమార్తె నిద్రిస్తోన్న సమయంలో రుబ్బు రోలుతో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మధుబాల మృతి చెందింది. మృతిరాలి సోదరి వెంకటమ్మ పిర్యాదు మేరకు దర్శి సీఐ మోయిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి