ప్రకాశం జిల్లా కురుచేడు మండలం కల్లూరు గ్రామం పచ్చని పంట పొలాలు.. పచ్చదనంతో శోభిల్లుతోంది. ఎటుచూసినా పచ్చని వరి పైర్లతో ఎంతో చూడ ముచ్చటగా ఉంది. పచ్చని పైర్లను చూసి.. గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లగా వర్షాలు లేక... గుండ్లకమ్మ, సాగర్ కాల్వలకు నీళ్లు రాక.. చాలా ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం వలన సాగర్ కాల్వకి నీళ్లు వచ్చాయని, ఆ నీటితో తమ ఊరి చెరువు నిండిందన్నారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడం వలన.. పంటలు బాగా పండాయని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: