నటుడు గిరిబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - latest news of actor giribabu
సినీ నటుడు ఎర్రా గిరిబాబు.. తన స్వగ్రామైన ప్రకాశం జిల్లా రావి నూతల గ్రామంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. తండ్రి నాగయ్య జ్ఞాపకార్థం శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎముకలు, కీళ్లు, ఘుగర్, బీపీ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు, రఘబాబు హాజరయ్యారు.
------------------------------------ సినీనటుడు ఎర్రా గిరిబాబు స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో గిరిబాబు గారి సతీమణి యర్రా శ్రీదేవి మరియు వారి తండ్రి యర్రా నాగయ్య గారి జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు హాజరయ్యారు.సినీనటుడు గిరిబాబు మరియు రఘుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సినీనటుడు రఘుబాబుతెలియజేశారు.ఎముకలు, కీళ్లు, షుగర్ ,బీపీ వంటి వ్యాధులకు ఉచితంగా చూసి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు దీనిని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలన్నారుBody:.Conclusion:.