ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గోగినేనివారిపాలెంలో ఎక్సైజ్ అధికారులు... నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 4,300 లీటర్ల బెల్లం ఊట, 190 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అక్రమంగా లిక్కర్ తయారు చేస్తోన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు.
ఇదీ చూడండి: