ప్రకాశం జిల్లా కారంచేడులో నివాసం ఉంటున్న దగ్గుబాటి రామ్మోహన్ నాయుడు ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 10 కేజీల వెండి వస్తువులు, 60 వేల నగదు, 16 విలువైన శారీలు, దుస్తులు చోరీ అయినట్లు రామ్మోహన్ నాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ తెలిపారు. పని మనిషి ఇంటిని శుభ్రం చేయటానికి వచ్చినప్పుడు ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఉండటంతో హైదరాబాద్లోని యజమానులకు సమాచారం ఇచ్చినట్లు వారు వివరించారు. పది రోజుల క్రితమే రామ్మోహన్ నాయుడు కుటుంబంతో సహా హైదరాబాద్లో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లినట్లు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..?