ప్రకాశం జిల్లా చిన్నగంజాంలోని నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. అందుకే 2017లో నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.18 కోట్లు వెచ్చించి పూర్తి చేశారు. తర్వాత మారిన పరిస్థితులతో ఆ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం రోజుకు 50 మంది వరకు వైద్యసేవలు వినియోగించుకుంటున్నారు. శిథిలావస్థ భవనంలో చికిత్సలు ఇబ్బందిగా ఉన్నాయని రోగులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు పెచ్చులూడి పడతాయోనని భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్త భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: విదేశీ కొలువు వదిలి.. చిరుధాన్యాల సాగు పట్టి..