గ్రామం నుంచి తమ కుటుంబాన్ని వెలివేశారంటూ.. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన విద్యార్థిని కోడూరి పుష్ప రాసిన లేఖపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. తక్షణం గ్రామాన్ని సందర్శించి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి రాసిన లేఖను కలెక్టరుకు పంపి ఆరా తీయాలని సూచించారు.
ఇదీ చిన్నారి లేఖ సారాంశం
మాజీ ఎంపీటీసీ, వైకాపా నాయకుడు కోడూరు వెంకటేశ్వర్లుతో... గ్రామ పెద్దలకు ఒక భూమి విషయంలో 3 నెలల క్రితం వివాదం మొదలైంది. తనను ఊరి నుంచి అకారణంగా బయటకు పంపేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు, జులై 22న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం అధికారులు గ్రామానికి వెళ్లి పెద్దలకు నచ్చజెప్పి ఆగస్టు 28న బాధితుడిని స్వస్థలానికి పంపారు. అయితే వారం క్రితం గ్రామస్థులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంకటేశ్వర్లు మనవరాళ్లు, మనుమడు పాఠశాలకు వస్తే తమ పిల్లల్ని పంపమని ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సామాజిక బహిష్కరణపై చిన్నారి పుష్ప ముఖ్యమంత్రికి లేఖ రాసింది. సమస్యను పరిష్కరించాలని కోరింది.
ఇవీ చదవండి..