తమను గ్రామం నుంచి వెలివేశారంటూ ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాయడం తెలిసిందే. ఆ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం చిన్నారి కోడేరు పుష్ప విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఊళ్లో దుర్భర పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించి, న్యాయం కోరిన చిన్నారి ధైర్యాన్ని చంద్రబాబు అభినందించారు. తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందనే భయాన్ని ఆ చిన్నారిలో తొలగించాలని కోరారు. చిన్నారి పుష్ప నిర్భీతిగా, స్వేచ్ఛగా చదువుకోవాలని, రేపటి పౌరురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: చిన్నారి లేఖపై స్పందించిన జగన్..విచారణకు ఆదేశం