ల్యాండ్ ప్యూరిఫికేషన్ పేరుతో మే31 నాటికి సరికొత్త భూ రికార్డుల తయారీ కార్యక్రమం పూర్తిచేస్తామని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ భవనంలోని సమావేశ మందిరంలో గృహనిర్మాణశాఖ మంత్రి రంగనాథ రాజుతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో పారదర్శక విధానం అమలుచేస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభింస్తామని సుభాష్ చంద్రబోస్ వివరించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ...ఉగాది నాటికి ప్రకాశం జిల్లాలో రెండు లక్షల మందికి ఇల్లు కట్టించడానికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశామని అన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో 50వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది సొంతింటి కల తమ ప్రభుత్వం నెరవేర్చనుందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ , పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.
మే 31 నుంచి సరికొత్త భూ రికార్డులు: ఉప ముఖ్యమంత్రి - revenue deparment in ap latest news
రెవెన్యూ శాఖ రికార్డులన్నింటిని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. కొత్త రికార్డులను తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభింస్తామని చెప్పారు.