ప్రకాశం జిల్లా పెద ఉయ్యాలవాడలో దారుణం జరిగింది. కొనకలమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన తాళ్ళూరి ఎబెల్.. తనకు వరుసకు సోదరి అయిన మహిళపై కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం ఎబెల్ కు రూతమ్మతో వివాహం జరిగింది. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రిత మళ్లీ గొడవపడ్డారు. రూతమ్మ పెద ఉయ్యాలవాడలోని తన పెద్దమ్మ కొడుకు ఇంటికి వెళ్లింది. అక్కడికీ వెళ్లిన ఎబెల్.. రూతమ్మతో మళ్లీ గొడవపడ్డాడు. అడ్డం వచ్చిన రూతమ్మ వదిన దివ్యభారతిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గాయపడిన దివ్యభారతిని హుటాహుటిన దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: