ETV Bharat / state

మాధవ్ వచ్చాడు... అన్నం తెచ్చాడు... అందరికి పెట్టాడు - poor people latest news in ongole

అమ్మా అన్నం తెచ్చా తిను... అనే మాట ఎప్పుడు వినపడుతుందా అని వారంతా ఎదురుచూస్తారు. ఆటోపై రుచికరమైన భోజనం తెచ్చే దేవుడు లాంటి వ్యక్తి రాక కోసం పడిగాపులు కాస్తారు. రక్తం పంచుకున్న వారే పట్టించుకోకుండా రోడ్డున పడేస్తే... మీకు నేనున్నానంటూ... రెండు పూటలా కడుపుతున్నాడు ఓ అన్నదాత. చిన్నాపెద్దా... ముసలీ ముతకా కలపి... రోజుకు 180 మందికి పైగా అన్నదానం చేస్తున్నాడు. తన సేవలకు అడ్డంగా మారిన ఉద్యోగాన్నీ వదిలేసి... మానవసేవలో తరిస్తున్న మాధవ్​పై ప్రత్యేక కథనం.

madav
author img

By

Published : Nov 16, 2019, 4:14 PM IST

పేదల కడుపునింపుతున్న మాధవ్

అనాథలకు ఆనందంగా ఆహారాన్ని పంచుతున్నాడు మాధవ్‌. ప్రకాశం జిల్లా లింగంపాలెం వాసి మాధవ్‌... రిమ్స్‌లో సైకాలజీ కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఒంగోలులో నివాసముంటూ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన... ఆసుపత్రి ఆవరణలో, రహదారుల వెంట, కార్ల షెడ్ల కింద ఆకలితో అలమటించే... వారిని గమనించారు. అనారోగ్యం బారినపడిన కొందరు... అన్నం లేక ఆకలితో అలమటించే వారిని మాధవ్ గుర్తించారు. విధులకు వచ్చే సమయంలో భార్య పెట్టే అన్నంలో సగాన్ని ఒక్కో మనిషికి పెట్టడం ఆరంభించారు. అలా సేవ ప్రారంభించిన మాధవ్‌... తర్వాత కాలంలో ఉద్యోగం వదిలి... పేదల సేవలో తరిస్తున్నారు.

మాధవ్‌ సేవను గుర్తించిన ఆయన భార్య మజ్నూ... ఈ కార్యక్రమంలో భాగమైంది. ఆమె గర్భిణీగా ఉన్న సమయంలో ఇద్దరూ వంట చేసి... ఆ ఆహారాన్ని ఆటోల్లో పేదలున్న ప్రాంతానికి తీసుకెళ్లి ఇచ్చేవారు. ఆకలిలో ఉన్న వృ‌ద్ధులు... మాధవ్‌ ఎప్పుడు అన్నం తెస్తాడా... అని ఎదురుచూడటం ప్రారంభించారు. అలా... కొందరితో ప్రారంభమైన మాధవ్‌ దంపతుల సేవ... రోజురోజుకూ పెరిగింది.

మాధవ్‌ చేస్తున్న సేవను గుర్తించిన ఆయన తల్లి, వదిన, పిల్లలు అందరూ తలోచేయీ కలిపారు. రోజూ ఉదయాన్నే వంటకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 180 మంది వరకూ ఈ దంపతులు భోజనం పెడుతున్నారు. కన్నవారే తమను దూరం చేసుకుంటే... ఎలాంటి సంబంధం లేని వ్యక్తి.. తమను ఆదుకుంటున్నాడని వృద్ధులు చెబుతున్నారు. ఉన్నంతలో తాము పేదలకు సాయం చేస్తున్నామని... ఎవరైనా చేయూత అందిస్తే... సేవను విస్తృతం చేస్తామని మాధవ్‌ దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మాధవ్ చేస్తున్న మంచి పనిలో తలోచేయి వేస్తే బాగుంటుంది కదూ..

ఇవి కూడా చదవండి:

నేడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్‌కల్యాణ్‌ భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.