ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ప్రమాదవశాత్తు లారీ కింద పడి కరీముల్లా అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కంభం రోడ్డులో నివాసముంటున్న రఫీ కుమారుడు కరీముల్లా... స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లోనుంచి బయటకు వచ్చిన కరిముల్లా.. తెలిసిన వారి ద్విచక్ర వాహనం తీసుకుని పూల సుబ్బయ్య కాలనీకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతనికి ద్విచక్ర వాహనం సరిగా నడపడం రాదు. ఈ కారణంగా.. రాంగ్ రూట్లోకి వెళ్లి... ప్రమాదవశాత్తూ లారీ వెనుక టైర్ల కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవీ చదవండి: