ETV Bharat / state

పింఛనే ఆధారం.... రేషన్​ బియ్యంతోనే భోజనం!

ఓ ప్రమాదం ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇంటి పెద్ద నడుము విరిగి చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. అతని భార్య.. భర్తకు సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దీనివల్ల ఆదాయం వచ్చే మార్గం లేక కుటుంబ పోషణ భారమైంది. ప్రభుత్వ సాయం కోసం ఇప్పుడా కుటుంబం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కార్మికుడి కష్టాలు
author img

By

Published : Nov 5, 2019, 7:31 AM IST

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లికి చెందిన యాకోబు తాపీమేస్త్రీగా పనిచేస్తుండేవారు. 2014 సంవత్సరంలో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి పడటంతో.. నడుము విరిగి నడవలేని స్థితికి చేరుకున్నారు. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. భర్త బాగోగులు చూసుకుంటూ యాకోబు భార్య ఇంట్లోనే ఉంటోంది. అతని చికిత్స కోసం చేసిన అప్పులు ఇప్పుడా కుటుంబానికి గుదిబండగా మారాయి. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ కష్టంగా మారింది. తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పించాలని అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని యాకోబు వాపోయాడు.

2014 నుంచి ఎన్నోసార్లు కలెక్టరేట్​కు వచ్చి అధికారులకు తన కష్టాలు వివరించినా సాయం అందలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ రెండు సార్లు స్పందనలో కలెక్టర్​ని కలిసి తన సమస్య తెలిపానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్​ ఏ మాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కుటుంబమంతా రేషన్ బియ్యం తిని కాలం గడుపుతున్నామనీ.. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని యాకోబు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

ఆగని ఇసుక ఆత్మహత్యలు.. కాకినాడలో మరొకరు బలవన్మరణం

Intro:AP_ONG_10_04_FOR_CM_HELP_PKG_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
నాలుగు సంవత్సరాల నుంచి నలుగురు బిడ్డల్ని వెంటపెట్టుకొని సహాయం కోసం అధికారుల చుట్టూ తిరిగుతున్నాడు ఆ వికలాంగుడు. రెండు అంతస్థుల భవనం మీద నుంచి జారి కింద పడి నడుం చచ్చుబడి నడవలేని పరిస్థితుల్లో చెక్క కుర్చీలోనే కలెక్టరేట్ చుట్టు సాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు ఆ భవన నిర్మాణ కార్మికుడు. భార్య నలుగురు బిడ్డలను పోషించడం కష్టం గా ఉంది కనికరించి సాయమందించమంటున్న ప్రకాశం జిల్లా చెందిన వికలాంగ భవన నిర్మాణ కార్మికుడు దీనావస్థ గురించి ఈటీవీ కథనం

వాయిస్ ఓవర్ : ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లి కి చెందిన యాకోబు భవన నిర్మాణంలో తాపీగా పనిచేస్తుండేవాడు. 2014 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో భవన నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు రెండో అంతస్తులో నుంచి జారి పడి నడుములు విరగడంతో నడవలేని పరిస్థితుల్లో చెక్క కుర్చీకి పరిమితమయ్యాడు. అప్పటి వరకు తనతో పాటు కూలీకి వచ్చి నాలుగు రూపాయలు సంపాదించే భార్య కూడా యాకోబు బాగోగులు చూడటం కోసం ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. యాకోబు ఆరోగ్యం మెరుపరచడానికి చేసిన అప్పులు వారికి గుదిబండగా మారాయి. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ కష్టంగా మారింది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పించి ఆదుకోవాలని అధికారులు చుట్టూ ప్రదర్శన చేసిన ప్రయోజనం మాత్రం శూన్యం. 2014 నుంచి పదుల సంఖ్యలో కలెక్టరేట్ కు చేరుకొని అధికారులకు తన కష్టాలు వివరించిన ప్రయోజనం లేదని యాకోబు వాపోయాడు. ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఇస్తున్న తన బాగోగుల కోసం ఇంటికే పరిమితమైన భార్య ను, నలుగురు బిడ్డల్ని సాకడం కష్టంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో కూడా రెండు సార్లు స్పందనలో కలెక్టర్ ని కలిసి సమస్య తెలిపడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి స్పందించి ఆర్థిక సహాయం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.....బైట్
యాకోబు, బాధితుడు

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.