ఆ బామ్మ వయసేమో 80.. మనసు మాత్రం పదహారే అన్నట్లు ఉత్సాహపరిచింది. జీడి గింజల్లో జిల్లాటలో... అంటూ అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. పాట ఏదైనా సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదిపి నృత్యం చేసింది. నాతో పోటీకి రాగలరా అని యువతకు సవాల్ విసిరింది. ప్రకాశం జిల్లా ఒంగోలు తాత బిల్డింగ్స్ బాపూజీ విగ్రహం వద్ద జరిగిన నరకాసుర వధలో ఈ బామ్మ పాల్గొంది. నరకాసుర వధకు ముందు జరిగిన సాంసృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ.. అందరినీ అలరిచింది.
ఇదీ చదవండి: మిఠాయి టపాసులతో తియ్యని వేడుక చేసుకుందాం