రవాణాకు సిద్ధంగా ఉంచిన 45 ఎర్రచందనం దుంగలను ప్రకాశం జిల్లా చిన్నకందుకూరులో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సురేంద్ర నాథ్‌రెడ్డి అనే వ్యక్తి తన పొలంలో ఎర్ర చందనాన్ని దాచాడు. విషయం తెలుసుకున్న కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు... మార్కాపురం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు వరకు ఉంటుందని డీఎఫ్ఓ ఖాదర్ భాషా తెలిపారు. ఎక్కడైనా ఎర్ర చందనం తరలిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని... అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచటంతోపాటు తగిన పారితోషకం ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: