ప్రకాశం జిల్లా గిద్దలూరులో 120 ఏళ్ల క్రితం నాటి... ఎమ్మార్వో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఈ కార్యాలయం ఎంతో మంది ప్రజలకు సేవలందించింది. ఇప్పుడు ఈ పాత భవనం స్థానంలో కోటి రూపాయల వ్యయంతో కొత్త కార్యాలయం నిర్మించారు. కార్యాలయం చుట్టూ రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.5 లక్షల వ్యయంతో సుందరీకరణ పనులను వేగంవంతం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఇదీ చూడండి: 100 ఏళ్ల నాటి భవనం అలానే ఉంది.. కానీ 30 ఏళ్ల భవనం?