సీఏఏకి మద్దతుగా...
సీఏఏ బిల్లుకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు, వివిధ ప్రజాసంఘాలు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాజపా నేతలు మాధవ్, మాజీఎంపీ హరిబాబు, మాజీఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు సీఏఏపై ప్రసంగించారు.
సీఏఏకి వ్యతిరేకంగా...
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ... నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ పార్టీల మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. మైనారిటీలను అభద్రతా భావానికి గురిచేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: