ETV Bharat / state

కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైఎస్​ఆర్​ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించారు.

ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
author img

By

Published : Oct 14, 2019, 7:37 PM IST

ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టిలోపాలు ఏవైనా ఉంటే మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు .

ఇదీ చూడండి:నేడు అనంతలో సీఎం జగన్​ పర్యటన..కంటి వెలుగు పథకం ప్రారంభం

Intro:కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేకపాటి

Body:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఉదయగిరి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులచే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు దృష్టి లోపాన్ని నివారించి పేద విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఉద్దేశంతోనే కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టిలోపాలు ఏవైనా ఉంటే మెరుగుపరుచుకోవాలి అన్నారు. గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీ కల కంటి వెలుగు కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చేజర్ల సుబ్బారెడ్డి తాసిల్దార్ ప్రసాద్ , ఎం ఈ ఓ మోహన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిక్షాలు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Conclusion:కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.