సంక్రాంతి సంబరాలు ఊరూ వాడా ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు కోలాహలంగా జరిగాయి. రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సాగిన ఈ పోటీల్లో పలు జిల్లాలకు చెందిన 25 జతల ఎడ్లు పోటీ పడ్డాయి. సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసేలా గత 32 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని తిలకించేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. పోటీల్లో నిమిషాల వ్యవధిలో మూడు కిలోమీటర్ల దూరాన్ని ఎడ్లు చుట్టివచ్చాయి. గంగపట్నం, కోవూరు, యల్లాయపాలెం ఎడ్లు మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి.
ఇదీ చదవండి: