అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు సంగం మండలం అరవపాళెంలో మిరపతోటకు నీరు పెట్టుకునేందుకు ఓ నీటి గుంతను తవ్వారు అక్కడి రైతులు. ఆ గుంత నుంచి దుర్వాసన రావటంతో... అందులోకి తొంగి చూశారు. కుక్కపిల్ల మృతదేహం కనిపించగా పూడ్చేందుకు సిద్ధమయ్యారు. గుంతలోకి అడుగుపెట్టగానే బుసలు కొడుతూ రెండు నాగుపాములు పైకి లేచాయి. అంతే... ఆ రైతు పైప్రాణాలు పైనే పోయాయి. పాములు బయటకు తీసే ధైర్యం లేక, వాటిని దైవంగా భావించి చంపకుండా వదిలేశామని రైతులు చెప్పారు. ఆ పాములను గుంతలోనుంచి బయటకు తీసి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: నిధుల జాప్యం.. కావలి మంచినీటి పథకం ఆలస్యం