చెత్త బండిలో సుప్రభాతం ఎందుకో తెలుసా? ఇంటింటా చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఎలా వస్తారు? ఏంటి కొత్తగా అడుగుతున్నారు అనుకుంటున్నారా? అవునండీ మరి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి ఈ ప్రశ్న అడగటం మామూలైపోయింది. పొద్దుపొద్దునే విజిల్ వేసుకుంటూ చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ మాత్రం సుప్రభాతం వినిపిస్తున్నారు. ఈరోజు నుండే మెుదలుపెట్టిన ఈ మేలుకొలుపు కార్యక్రమం స్థానికుల చేత ప్రశంసలు పొందుతోంది. సుమారు పది వాహనాలకు మైక్ సెట్లను అమర్చి సుప్రభాతాన్ని వినిపిస్తున్నారు. ఉదయాన్నే సుప్రభాతం వినటం వలన ప్రజలు మానసిక ప్రశాంతత పొందుతారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఈనాడు' ఆటో షో కార్యక్రమానికి విశేష స్పందన