ఓ దివ్యాంగుడు సైకిల్‌పై యాత్ర చేపట్టాడు. అది తన కోసం కాదు.. ఏపీ రాష్ట్ర భవిష్యత్ కోసం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యాల ప్రసాద్... ప్రత్యేక హోదా కోసం సైకిల్ యాత్రకు పూనుకున్నాడు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు 1460 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 12వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర కృష్ణా జిల్లా చేరుకుకన్న తర్వాత ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన తిరిగి కృష్ణా జిల్లా నుంచి యాత్ర చేపట్టిన ప్రసాద్ ప్రస్తుతం నెల్లూరు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లి హోదా కోరుతూ ఉపరాష్ట్రపతి, ప్రధానులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం'