ETV Bharat / state

నిరీక్షించలేక నీరసం... వైద్యం కోసం వాగ్వాదం - నెల్లూరు జిల్లా ఉదయగిరిలోో నిరీక్షించలేక నీరసించి... వైద్య సిబ్బందితో వాగ్వాదం

వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు గంటల తరబడి నిరీక్షించినా.. ఫలితం లేకుండా పోతోంది. ఓపిక నశించిన రోగులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ పరిస్థితితో కాసేపు గందరగోళం నెలకొంది.

patient-friction-with-the-medical-staff-at-udaygiri
నిరీక్షించలేక నీరసించి... వైద్య సిబ్బందితో వాగ్వాదం
author img

By

Published : Dec 17, 2019, 10:35 PM IST

నిరీక్షించలేక నీరసించి... వైద్య సిబ్బందితో వాగ్వాదం

ఉదయగిరి సామాజిక ఆరోగ్య వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లు ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఒక్కరే అన్నిరకాల రోగులకు వైద్యం చేయాల్సి వస్తోంది. ఫలితంగా.. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎంత ఎదురు చూసినా... డాక్టర్ వద్ద చూపించుకునే అవకాశం రాని రోగులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రైవేట్​ ఆసుపత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక.. ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఇంతటి నిర్లక్ష్యం ఏమిటని నిలదీశారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. విధుల్లో ఉండాల్సిన మరో ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాత్రి విధులు నిర్వహించగా... మరొకరు సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

ఇవీ చూడండి...

ఉదయగిరిలో సదరం శిబిరం ప్రారంభం

Intro:నిరీక్షించిన లేక నీరసించి... వైద్య సిబ్బందితో రోగుల వాగ్వాదం

వెంటాడిన రోగంతో... నీరసించిన దేహంతో... అడుగులో అడుగు వేసుకుంటూ వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు గంటల తరబడి నిరీక్షించిన వైద్యం అందలేదు. ఓపిక నశించిన రోగులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.

Body:ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం ఉదయగిరి తో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వచ్చారు. వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లు ఉండగా ఠాగూర్ డాక్టర్ ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆయన ఒక్కడే అన్నిరకాల రోగులకు వైద్యం చేయాల్సి రావడంతో పాటు ఓ పిలో రోగులు పరీక్షించాల్సి వచ్చింది. ఈ కారణంగా వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించిన డాక్టర్ వద్ద చూపించుకునే అవకాశం రాలేదు. నిరుత్సాహం చెందిన రోగులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకునేవారు లేరని పలువురు రోగులు ఆవేదనచెందారు చెందారు. మరోవైపు డాక్టర్ వద్ద పరీక్షించుకుని సూది వేయించుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిందే దౌర్భాగ్యం నెలకొందని వాపోయారు. ప్రైవేటు వైద్యశాలలో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఇంతటి నిర్లక్ష్యం ఏమిటని పలువురు రోగులు ప్రశ్నించారు. వృద్ధులు, చంటి బిడ్డలతో వైద్యం కోసం వచ్చిన వారు నిరీక్షించే ఓపిక లేక అవస్థలు పడ్డారు. వైద్యశాలలో విధుల్లో ఉండాల్సిన మరో ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాత్రి విధులు నిర్వహించగా మరొకరు సెలవు లో ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు చేసే డాక్టర్లు అందుబాటులో లేక ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చేసేదేమీలేక రోగులు అక్కడే గంటల తరబడి ఉండి వైద్యం చేయించుకొని నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని సరిపడినంత మంది వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో రోగులకు సేవలు అందించేలా చూడాలని కోరుతున్నారు.

Conclusion:బైట్స్ : 1. మాల కొండయ్య, వైద్యం కోసం వచ్చిన వ్యక్తి
2. ఠాగూర్, ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.