నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి తనిఖీ చేశారు. ఉదయగిరి, వింజమూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీ నిర్వహించిన ఆమె... విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని రుచి చూశారు. అనంతరం కేంద్రంలో నిల్వ ఉన్న సరుకులు, రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు క్రమశిక్షణతో... ఆటపాటలతో చదువులు చెప్పి వారికి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. కేంద్రం నిర్వహణపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉండే పోస్టుల భర్తీకి... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
ఇదీ చూడండి: కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా