ETV Bharat / state

గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి - గాంధీ 150వ జయంతి

దక్షిణాదిలో రెండో సబర్మతిగా పేరుగాంచింది నెల్లూరు జిల్లాలోని పల్లెపాడు గాంధీ ఆశ్రమం. మహాత్ముడే స్వయంగా ప్రారంభించిన ఈ ఆశ్రమం... స్వతంత్ర సమరయోధుల స్పర్శలతో పునీతమైంది. బాపూజీ ఆశయాలు ఎలుగెత్తి చాటుతున్న ఈ ఆశ్రమం చరిత్రాత్మక చిహ్నంగా నిలుస్తోంది.

Mahatma Gandhi
author img

By

Published : Sep 25, 2019, 7:34 AM IST

Updated : Sep 26, 2019, 7:01 AM IST

మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

జాతిపిత మహాత్మాగాంధీ రెండుసార్లు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడుకు వచ్చారు. ఇక్కడున్న ఆశ్రమం స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించింది. అంటరానితనం నిర్మూలనలో భాగంగా బాపూజీ చేతుల మీదుగా 1921 ఏప్రిల్ 7న ఈ ఆశ్రమం ప్రారంభమైంది. పవిత్ర పినాకినీ నదీతీరం సమీపంలో... సంఘ సేవకురాలు పొనకా కనకమ్మ ఇచ్చిన 13ఎకరాల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

బాపూజీ ఈ ఆశ్రమానికి 1929మే 11న మళ్లీ వచ్చారు. ఓ రాత్రి ఇక్కడే బస చేశారు. స్వతంత్ర పోరాటంలో పల్లెపాడు ఆశ్రమం ప్రధాన కేంద్రంగా పనిచేసింది. పల్లెపాడుకు చెందిన హనుమంతరావు, చతుర్వేదుల కృష్ణయ్యలు ఆశ్రమ నిర్మాణాన్ని చేపట్టగా... గాంధీ సన్నిహితుడు రుస్తుంజీ అప్పట్లో రూ.10వేలు విరాళం ఇచ్చారు. దీంతో ఆశ్రమ ప్రధాన భవనానికి రుస్తుంజీ పేరుపెట్టారు. ఈ ఆశ్రమంలో నూలు వడకటం, ఖాదీ ఉత్పత్తి, గీతా పారాయణం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తర్వాత కాలంలో నిర్వాహకులు జైలుపాలు కావడం కారణంగా... ఖాదీ ఉత్పత్తి నిలిచిపోయింది. కాలక్రమేణా భవనం శిధిలావస్థకు చేరి ఉనికి కోల్పోయే దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో 2006లో రెడ్​క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో భవనం పునర్నిర్మాణం జరిగింది. ఆశ్రమ అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేసి... గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా గాంధీ జయంతి, వర్ధంతి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Intro:Body:

గాంధీజీ వాడిన వస్తువు...  వేటపాలెం గ్రంథాలయంలో 

summary...

స్వాతంత్ర్యపోరాటంలో దేశమంతా పర్యటిస్తూ.. మహాత్ముడు అనేక  ప్రాంతాలకు వచ్చారు. ఆంధ్రరాష్ట్రంలో ఉధృతంగా జరిగిన చీరాల- పేరాల ఉద్యమాన్ని  ప్రోత్సహించేందుకు ఆయన వచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పురాతన గ్రంథాలయం వేటపాలెం సారస్వతినికేతనానికి  మహాత్మడే శంకుస్థాపన చేశారు. గాంధీజీ బాగా ఉపయోగించిన వస్తువు ఆ లైబ్రరీలో ఇప్పటికీ భద్రంగా ఉంది. 

మహాత్ముడి పిలుపునందుకుని.. యావత్ దేశమే.. స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొంది. అందులో తెలుగునేలదీ ప్రత్యేక స్థానం. గాంధీ స్వాతంత్ర్రోద్యమ స్ఫూర్తితో ఇక్కడ అనేక చోట్ల ఉద్యమాలు జరిగాయి.  అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది..చీరాల పేరాల ఉద్యమం. 

---

ప్రకాశం జిల్లా చీరాల... పోరాటాల పురిటిగడ్డ. స్వాతంత్రోద్యమం ఊపందుకున్న రోజుల్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కట్టమని హుకుం జారిచేశారు. రొక్కం కట్టే ప్రసక్తే లేదని... ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఊరు ఖాళీ చేసి... చీరాల సమీపంలో గుడిసెలు వేసుకుని తెల్ల దొరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న గాంధీజీ 1929లో ... చీరాల శివాలయం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ గాంధీ సమావేశానికి వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. బాపూజీ సమావేశం నిర్వహించిన ప్రదేశంలో... నల్ల రంగులో ఉండే గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది చీరాల పట్టణంలో నల్లగాంధీ కూడలిగా పేరొందింది. 1929,1935 సంవత్సరాల్లో గాంధీజీ రెండు సార్లు చీరాల ప్రాంతానికి వచ్చారు. 1918లో వేటపాలెంలో వి.వి శ్రేష్టి నిర్మించాలనుకున్న సారస్వతనికేతనం భవనానికి 1929లో మహాత్ముడు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో జాతిపితను చూసేందుకు ప్రజలు అధికసంఖ్యలో  వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి... గాంధీజీ చేతి కర్ర విరిగిపోయింది. బాపూ ఆ కర్రను అక్కడే వదిలివెళ్లారు. జాతిపిత చేతికర్ర ఇప్పటికీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది.

బైట్ : 1: శ్రీవల్లి, లైబ్రేరియన్, సారస్వతనికేతనం 

గ్రంథాలయం గురించి గాంధీజీ స్వదస్తూరితో రాసి సంతకం పెట్టారు. ఇక్కడ మహాభారతం, భాగవతం, బాపూజీ జీవిత చరిత్రకు సంబంధించిన  పుస్తకాలున్నాయి. అంతేకాకుండా... 1940 ఏడాది ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలు ఇప్పటివరకూ ఉన్నాయి. అనేక అరుదైన పుస్తకాలున్న వేటపాలెం గ్రంథాలయం అనేకమంది పరిశోధకులకు రిఫరెన్సుగా ఉపయోగపడుతోంది. 

    AP_ONG_41_13_GANDHI_PKG_VISU_AP10068_SD

thumbnail_ గాంధీజీ స్వదస్తూరి ఇలా ఉంటుంది

Conclusion:
Last Updated : Sep 26, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.