ETV Bharat / state

ఉదయగిరిలో తెల్లరాయి మాయమవుతోంది... - ఉదయగిరిలో అక్రమంగా రవాణా చేస్తోన్న తెల్లరాయి

మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి తెల్లరాయిని వెలికి తీస్తోంది. అక్రమ రవాణా నిర్విరామంగా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా... అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతోన్న  తెల్లరాయి అక్రమ రవాణాపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

leelgal tranportation of white stone in udaygiri of nellore
ఉదయగిరిలో అక్రమంగా రవాణా చేస్తోన్న తెల్లరాయి
author img

By

Published : Dec 18, 2019, 5:37 PM IST

ఉదయగిరిలో మాయమవుతోన్న తెల్లరాయి

ఉదయగిరిలో మాయమవుతోన్న తెల్లరాయి

ఇదీ చూడండి: నిరీక్షించలేక నీరసం... వైద్యం కోసం వాగ్వాదం

Intro:ప్రభుత్వ భూములను కొల్లగొట్టి తెల్లరాయి అక్రమ రవాణా...

మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి తెల్లరాయి ని వెలికి తీస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా హద్దులు దాటిస్తూ రూ. లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటుంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.


Body:ఉదయగిరి ప్రాంతంలో కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు విశాలంగా ఉన్నాయి. వీటిలో తెల్లరాయి నిక్షేపాలను అపారం. మైనింగ్ మాఫియా కన్ను తెల్లరాయి పై పడింది. గుట్టుచప్పుడు కాకుండా తెల్లరాయి ని వెలికి తీస్తూ అక్రమ రవాణా చేస్తూ లక్ష రూపాయల సొమ్ము చేసుకుంటుంది. విదేశాల్లో తెల్లరాయి కి డిమాండ్ ఉండటంతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ ఆదాయ వనరుగా మార్చుకుంటుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి నిర్దేశించిన నగదు చెల్లించి మైనింగ్, రెవెన్యూ శాఖ అనుమతి తీసుకొని తెల్లరాయి తరలించు కోవచ్చు. మైనింగ్ మాఫియా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్ట్ కు తరలించి విదేశాలకు పంపుతూ రూ. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. కళ్లెదుటే తెల్లరాయి అక్రమ రవాణా నిర్విరామంగా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాలో తెర చాటున అధికారుల ప్రమేయం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు అయినా చర్యలు తీసుకొని విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలు కాకుండా అడ్డుకట్టవేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


Conclusion:బైట్ : ప్రసాద్, తహసీల్దార్, ఉదయగిరి

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.