ETV Bharat / state

కార్తిక పౌర్ణమి సందడి.. రద్దీగా శివాలయాలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ పెరిగింది.

రద్దీగా మారిన శివాలయాలు
author img

By

Published : Nov 12, 2019, 3:00 PM IST

కార్తిక పౌర్ణమి సందడి.. రద్దీగా శివాలయాలు

కార్తిక పూర్ణిమ సందర్భంగా నెల్లూరు జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే ప్రజలు శివయ్య దర్శనానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయగిరి, కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సత్రం సముద్ర తీరాల్లో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. మూలస్థానేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా.. కార్తికపౌర్ణమి శోభ

Intro:Ap_Nlr_01_12_Karthika_Pournami_Kiran_Av_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నెల్లూరు జిల్లాలోని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలైంది. నగరంలోని మూలస్థానేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించిన మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. డి.ఆర్.డి.ఓ. చైర్మన్ సతీష్ రెడ్డి మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నగరంలోని రాజరాజేశ్వరి ఆలయం, గుప్త పార్క్, నవాబుపేట, ఉస్మాన్ సాహెబ్ పేట, ఉమామహేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.