ETV Bharat / state

స్నేహితుడి ప్రాణమే ముఖ్యం... భిక్షాటన చేసేందుకూ వెనుకాడం...! - friends begging for another friend health problem in nellore

తల్లి.. తండ్రి.. సోదరుడు.. ఇలా అన్ని బంధాలను దేవుడు నిర్ణయిస్తే స్నేహం అనే బంధాన్ని మనకు మనమే నిర్ణయించుకుంటాం. మంచి స్నేహితుణ్ని సంపాదించిన ఏ వ్యక్తి అయినా అదృష్టవంతుడే. తమ స్నేహితుణ్ని ప్రాణాంతక వ్యాధి కబలిస్తోందని తెలిసి ఆ యువకులు మథనపడ్డారు. తామున్నామంటూ ధైర్యం చెప్పి... వైద్యానికి అవసరమయ్యే ధనం కోసం ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తున్నారు. ఆ యువకుడు, స్నేహితుల గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లా అనంతసాగరానికి వెళ్లాల్సిందే...!

friends
author img

By

Published : Oct 25, 2019, 7:44 PM IST

స్నేహితుడి ప్రాణాలు కాపాడేందుకు భిక్షాటన

నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన షేక్‌ ఖాజావలికి ప్రాణాంతక బోన్​ మ్యారో వ్యాధి సోకింది. సెంట్రింగ్​ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతనికి వైద్యం కోసం రూ.25 లక్షలు అవసమయ్యాయి. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడం వల్ల ఆ డబ్బు అతనికి, కుటుంబ సభ్యులకు శక్తికి మించినదే అయ్యింది. అయితే షేక్​వలీకి మేమున్నామంటూ అతని స్నేహితులు అండగా నిలిచారు. వైద్యానికయ్యే డబ్బు కోసం ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తున్నారు. ఎవరైనా దాతలు స్పందించి తమ స్నేహితుణ్ని కాపాడాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఖాజావలి తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖాజావలి కోసం స్నేహితులు పడుతోన్న తపనను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతూ... వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

నడిరోడ్డులో నాన్న కథ విషాదాంతం...!

Intro:సాయం కోసం బిక్షాటనBody:యాంకర్ వాయిస్: వారంతా స్నేహితులు. వారిలోని ఓ నిరుపేద యువకుడికి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. వైద్యానికి భారీగా నగదు వెచ్చించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు నిరుత్సాహ స్థితిలో ఉండిపోయారు. స్నేహితుడిని ఎలాగైనా కాపాడుకోవాలని మిగిలిన స్నేహితులు జోలె పట్టారు. ఇంటింటికి తిరిగి నగదు సాయం చేయాలని వేడుకున్నారు.

వాయిస్ ఓవర్:1. నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన అలీ ఇమాన్ భాష , కాలీబి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్ ఖాజావలి పదవ తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చదువు మానేశాడు. సెంట్రింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి సోకింది.

2. వైద్యులను సంప్రదించడం వైద్యానికి 25 లక్షలు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ప్రస్తుతం ఖాజావలి తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు స్పందించి సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

3.తమతో పాటు తిరిగే స్నేహితుడు ప్రాణాంతకమైన జోన్ మ్యారో వ్యాధి బారిన పడడం స్నేహితులను కలిచివేసింది. స్నేహితుడు ప్రాణాలను కాపాడుకునేందుకు స్నేహితులు అందరు జోలి పట్టారు. రెండు రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకున్నారు.ఇప్పటి వరకు సుమారు 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని స్నేహితులు పోగు చేశారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయం చేయాలని అర్పిస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు‌ జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.