ETV Bharat / state

నేటి నుంచే ఫ్లెమింగో పక్షుల పండుగ - నెల్లూరులో ఫ్లెమింగో పక్షుల పండుగ

పర్యాటకులకు అమితంగా ఆకట్టుకునే ఫ్లెమింగో పక్షుల పండుగ రానే వచ్చింది. నేటి నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పులికాట్‌ ప్రాంతంలో ఇప్పటికే పక్షులు వేల సంఖ్యలో వచ్చి చేరుకోగా... పర్యాటకుల సందడి మొదలైంది.

fleming-fest-in-nellore-district
fleming-fest-in-nellore-district
author img

By

Published : Jan 3, 2020, 7:47 AM IST

నేటి నుంచే ఫ్లెమింగో పక్షుల పండుగ

నేటి నుంచి ఫ్లెమింగో పక్షుల పండుగ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రారంభంకానుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ ఉత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రాంభోత్సవానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీనివాసులురెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు హాజరవనున్నారు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పక్షుల పండుగను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ పర్యాటకలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

పులికాట్ పరిసర ప్రాంతాలకు వేలాదిగా ఫ్లెమింగోతో పాటు ఇతర జాతుల పక్షులు వలస వస్తుంటాయి. వేల కిలోమీటర్ల నుంచి వచ్చి 4నెలల పాటు ఇక్కడే విడిది చేస్తుంటాయి. స్థానిక మత్స్యకారులు చాలా కాలంగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. దీంతో వలస వచ్చే పక్షుల సంఖ్య భారీగా పెరిగింది. వీటిని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్యా గణనీయంగా పెరుగతూ వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం దీనిని గుర్తించి.. అధికారిక పండుగలా జరిపేందుకు నిర్ణయించింది. గత ఏడేళ్లుగా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ... 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు..

ఫ్లెమింగోలు, పెంటేంట్స్, పెలికాన్స్‌, వాటర్ బర్డ్స్‌, ప్లింటైల్స్, బ్లాంక్‌ స్టిల్స్‌, స్టీగల్స్‌ వంటి అనేక జాతుల విహంగాలు ఇప్పటికే పెద్దసంఖ్యలో వచ్చిచేరాయి. వీటిని వీక్షించేందుకు తరలివచ్చిన పర్యాటకుల కోసం.... నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. భీమునివారిపాలెంలో బోటు షికారు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా క్రీడాపోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.