నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు ఉల్లాసంగా ముగిశాయి. జిల్లా స్థాయి నుంచి ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు డీఆర్వో మల్లికార్జున్ అన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్స్.. జూనియర్ విభాగంలో కేఎస్ జూనియర్ కళాశాల, గీతాంజలి జూనియర్ కళాశాల జట్లు తలపడగా... గీతాంజలి జూనియర్ కళాశాల విజయం సాధించింది. సీనియర్ విభాగంలో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, ఎన్బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యానగర్ జట్లు పోటీ పడగా కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది.
ఇదీ చదవండి: