నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలకు నగరంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పంట పొలాలు నీటమునిగాయి. నర్సరీలో ఉన్న మిరప, బ్రోకోలి, క్యాబేజీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సంపంగి పూల మొక్కలు పూర్తిగా నాశనమయ్యాయి. దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:పెద్దపప్పూరులో నీట మునిగిన పంటలు